IND VS SA: దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత్ ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీమ్ బౌలింగ్ విభాగంపై ధీమా వ్యక్తం చేశాడు సీనియర్ ఆటగాడు చెతేశ్వర్ పుజారా. సౌతాఫ్రికాతో జరగబోయే ప్రతి టెస్టు మ్యాచ్‌లోనూ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ 20 వికెట్లు తీయగలదని విశ్వాసం వ్యక్తం చేశాడు.
"ఫాస్ట్ బౌలర్లు మా జట్టు బలం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారు చక్కగా రాణించగలరు. ప్రతి టెస్టు మ్యాచ్‌లోనూ 20 వికెట్లు రాబట్టగలరు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ బౌలింగ్ జట్టు అద్భతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లోను అదే విధంగా ఉంటుంది."
-చెతేశ్వర్ పుజారా