IND vs SA ODI Series: టీమ్ఇండియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో 17 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. మార్కో జాన్సన్‌కు వన్డే జట్టులో తొలి అవకాశం దక్కగా.. ఎన్రిచ్ నోర్జేకు చోటు దక్కలేదు. తొడ కండరాల గాయం నుంచి కోలుకోని కారణంగా నోర్జేకు విశ్రాంతి ఇచ్చింది సీఎస్ఏ.
వెస్టర్న్ కేప్ వేదికగా జనవరి 19 నుంచి 23 వరకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరగనుంది.
దక్షిణాఫ్రికా వన్డే స్క్వాడ్:
తెంబా బవుమా(కెప్టెన్), కేశవ్ మహారాజ్(వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జుబైర్ హంజా, మార్కో జాన్సన్, జన్నేమన్ మలన్, సిసంద మగాల, మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వాయిన్ పార్నెల్, ఆండిలే పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రెటోరియస్, కగిసో రబాడ, టబ్రాయిజ్ షంసి, రస్సీ వాన్ డర్ డస్సెన్, కైల్ వెర్రైన్నే.
ఇదీ చదవండి:
IND vs SA Virat Kohli: మరో టెస్టు గెలిస్తే.. కోహ్లీ ఖాతాలో 3 రికార్డులు
'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ప్లాన్ సిద్ధం చేశా'