తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SA test: టీమ్​ఇండియా కల.. ఈసారైనా నెరవేరేనా? - India vs South Africa 2021-22

first test preview: విదేశీ గడ్డపై మరో టెస్టు సిరీస్​ ఆడేందుకు టీమ్​ఇండియా రెడీ. దక్షిణాఫ్రికా జట్టుతో సెంచూరియాన్ వేదికగా తొలి టెస్టు ఆడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

team india test team
టీమ్​ఇండిాయ టెస్టు టీమ్

By

Published : Dec 26, 2021, 5:30 AM IST

IND VS SA: సఫారీ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్.. కీలక సమరానికి సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలయ్యే తొలి టెస్టులో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టాలనే ధ్యేయంతో ఉంది. బ్యాటింగ్‌లో బలహీనంగా కనిపిస్తున్న సఫారీ జట్టుపై గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. అయితే తుది జట్టు ఎంపిక భారత్‌కు సవాల్‌గా మారింది. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా కోహ్లీకి ఈ సిరీస్‌ కీలకంగా మారింది.

1992 నుంచి దక్షిణాఫ్రికాలో ఏడు సార్లు పర్యటించిన భారత్ ఒక్కసారి కూడా.. టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత్‌ అదే జోరును సఫారీ గడ్డపై కొనసాగించాలని భావిస్తోంది.

కెప్టెన్ కోహ్లీతో కోచ్ ద్రవిడ్

వన్డే సారథ్యం తప్పించడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లీ.. ఈ సిరీస్‌ గెలిచి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. 2019 నుంచి మూడంకెల స్కోరు చేయని విరాట్‌కు బ్యాటర్‌గానూ ఈ పర్యటన కీలకమే. పరుగుల వరద పారించి తన ఆట, కెప్టెన్సీపై వచ్చిన విమర్శలకు సమధానం చెప్పాల్సిన అవసరం కోహ్లీకి ఉంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కి సైతం ఇదే తొలి విదేశీ పర్యటన.

kohli dravid: టీమ్​ఇండియాకు జట్టు కూర్పే సవాల్‌గా మారింది. కొన్నిసార్లు జట్టు ఎంపికలో పొరపాట్లతో జట్టు నష్టపోయింది. గాయాల కారణంగా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ దక్షిణాఫ్రికా వెళ్లలేదు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్‌ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్​లో కెప్టెన్‌ కోహ్లీ ఎలానూ ఉంటాడు. సీనియర్‌ బ్యాటర్ పుజారాకు సైతం చోటు దక్కే అవకాశం ఉంది.

అరంగేట్ర సిరీస్‌లోనే అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్, పేలవ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానె మధ్య ఐదో స్థానం కోసం తీవ్రపోటీ ఉంది. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా శ్రేయస్‌ను ఆడించే అవకాశం ఉంది. ఐదుగురు బౌలర్లతో ఆడాలనుకుంటే బ్యాటింగ్‌ సైతం చేయగల శార్దుల్ ఠాకూర్‌ వైపే మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇషాంత్‌కు చోటు దక్కకపోవచ్చు. కివీస్‌తో రెండో టెస్టులో గాయం పేరు చెప్పి రహానె, ఇషాంత్‌ను తుదిజట్టు నుంచి తప్పించారు. బాక్సింగ్‌ డే టెస్టులోనూ., చోటు ఇవ్వకపోతే అధికారికంగా తప్పించినట్లవుతుంది. బుమ్రా, షమి, సిరాజ్‌, అశ్విన్‌లు బౌలింగ్ భారాన్ని మోసే అవకాశం ఉంది. వికెట్ కీపర్‌గా పంత్ ఉంటాడు.

బుమ్రా- సిరాజ్

సీనియర్లు రిటైర్ కావడం వల్ల ప్రభ కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు.. భారత్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. జట్టులో అనుభవజ్ఞులు లేకపోవడం ఆతిథ్య జట్టుకు ఇబ్బందిగా మారింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 69 మ్యాచ్‌లు, వైస్ కెప్టెన్ బవుమా 53 మ్యాచులు మినహా.. ఆ జట్టులో మరే ఆటగాడు 50 టెస్టులు ఆడలేదు. డీన్‌ ఎల్గర్, బవుమా, డికాక్, డసెన్‌లతో కూడిన బ్యాటింగ్ దళం.. కాస్త బలహీనంగా కనిపిస్తోంది. కగిసో రబాడా లాంటి ప్రపంచస్థాయి పేసర్​తో బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. రబాడా, ఒలివర్‌లు విసిరే బంతులను ఎలా ఎదుర్కొంటారు అనే దానిపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు టెస్టు ప్రారంభమవుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details