IND Vs SA Match Black Tickets : 2023 వన్డే కప్‌లో సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. అయితే ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు వేళ్ల మీద లెక్కపెట్టడం కూడా కష్టతరంగా మారింది. కానీ సెమీస్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 5న కోల్‌కతా వేదికగా జరగనున్న ఇండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్మడవుతున్నాయి. టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతండటం వల్ల బ్లాక్ మార్కెట్ దందా కూడా జోరుగా సాగుతోంది. క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని కొందరు దళారీలు క్యాష్ చేసుకుంటున్నారు. కోల్‌కతాకు చెందిన అంకిత్ అగర్వాల్ అనే వ్యక్తి రూ.2,500 మ్యాచ్ టికెట్లను రూ11 వేలకు విక్రయించాడు. దీనిపై సమాచారం అందుకున్న కోల్‌కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
'ఇండియా-దక్షిణాతాఫ్రిగా స్పెషల్ అదే'
IND VS SA World Cup 2023 :2023 వన్డే ప్రపంచ కప్‌లో భారత్-దక్షిణాఫ్రిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. దీంతో పాటు నవంబర్ 5న (Virat Kohli Birthday Date 2023) టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు కావడం వల్ల.. ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది. దీంతో ఈ మ్యాచ్‌కు విపరీతమైన హైప్ ఏర్పడింది. ఈ కారణంగా ఈ మ్యాచ్‌ను ఎలాగైనా చూడాలని అభిమానులు టికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఈ క్రమంలోనే అభిమానులు ఎంత ధరైనా వెచ్చిండడానికి సిద్ధం అయ్యారు. దీన్ని బ్లాక్ బకాసురులు క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్కో టికెట్‌ను 6 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ వరల్డ్ కప్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది టీమ్ఇండియా. అనధికారికంగా సెమీస్‌కు కూడా చేరింది. గురవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ గెలిస్తే సెమీన్ పక్కా అవుతుంది.