IND Vs SA Kohli third test: వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు దూరమైన సారథి కోహ్లీ.. మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. అతడు తిరిగి ఫిట్నెస్ సాధించేండుకు కసరత్తులు చేస్తున్నాడు. నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారంది. ఈ వీడియోలో టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ త్రోడౌన్ బౌలింగ్ చేస్తుండగా కోహ్లీ ఆడుతున్నాడు. ఇది చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. జనవరి 11న కేప్ టౌన్లో మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఒకవేళ కోహ్లీ.. ఈ మ్యాచ్ ఆడితే అతడికిది 99వ టెస్టు అవుతుంది.
ద్రవిడ్‌తో కలిసి కోహ్లీ నెట్ ప్రాక్టీస్.. మూడో టెస్టుకు అందుబాటులోకి! - టీమ్ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
IND Vs SA Kohli third test: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడో టెస్టుకు టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. నెట్స్‌లో కోచ్ ద్రవిడ్‌తో కలిసి విరాట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన అభిమానులు వీడియోను వైరల్ చేస్తున్నారు.
కోహ్లీ నెట్ ప్రాక్టీస్
కాగా, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. ప్రొటీస్ జట్టుకు 122 పరుగులు అవసరం.
ఇదీ చూడండి: కోహ్లీ కోలుకుంటున్నాడు.. త్వరలోనే ఆడతాడు: పుజారా