IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, పుజారాపై కీలక వ్యాఖ్యలు చేశాడు దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్ పీటర్సన్. వారిద్దరూ.. సౌతాఫ్రికాకు తలనొప్పిగా మారారని అన్నాడు. మూడో టెస్టులో భాగంగా గురువారం జరిగే ఆటలో వారిని త్వరగా పెవిలియన్‌కు చేర్చడంపై దృష్టిసారిస్తామన్నాడు.
"గురువారం మ్యాచ్‌లో మా ప్రధాన లక్ష్యం త్వరగా వికెట్లు పడగొట్టడం. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఇద్దరు మాకు కొంత తలనొప్పిగా మారారు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్. ఆ విషయాన్ని అతడు ప్రతిసారీ నిరూపించుకుంటూ వస్తున్నాడు. విరాట్‌ను త్వరగా ఔట్ చేస్తే.. మ్యాచ్‌లో భారీగా మార్పులు జరగొచ్చు" అని కీగన్ పీటర్సన్ పేర్కొన్నాడు.