IND VS SA First ODI: దక్షిణాఫ్రికాతో బుధవారం జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు సంబంధించిన తుదిజట్టు కూర్పు వివరాలను కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమైన శిఖర్ ధావన్‌కు అవకాశం కల్పించాడు రాహుల్. జట్టులో రోహిత్ శర్మ లేకపోవడం వల్ల ధావన్‌కు జోడీగా మరో ఓపెనర్‌గా తాను ఆడనున్నట్లు స్పష్టం చేశాడు.
"ధావన్ చాలా అనుభవం ఉన్న ఓపెనర్. అతడి నుంచి జట్టు ఏం ఆశిస్తుందో అతను అర్థం చేసుకోవాలి. కెప్టెన్‌గా అతిడికి సపోర్ట్ ఇచ్చి.. భారత జట్టు మెరుగైన స్కోరు చేసేందుకు సహాయపడతా" అని రాహుల్ అన్నాడు.
బోలాండ్ పార్క్ మైదానం స్పిన్‌కు అనుకూలం కావడం వల్ల అశ్విన్-చాహల్ ద్వయం కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ తొలి రెండు మ్యాచుల్లో ఆడతారని అన్నాడు. దీంతో గతకొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న చాహల్‌కు మరోసారి అవకాశం లభించినట్లు అయింది.
ఆరో బౌలర్‌గా అయ్యర్..