తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SA: విజయానికి ఆరు వికెట్లు దూరంలో టీమ్​ఇండియా - cricket live score

Team india: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు గెలిచేందుకు భారత్ అడుగు దూరంలో ఉంది. నాలుగో రోజు ఆట పూర్తయింది. ఈ మ్యాచ్​ గెలవాలంటే టీమ్​ఇండియా మరో ఆరు వికెట్లు తీయాల్సి ఉంది. అయితే గురువారం సెంచూరియన్​లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

team india
టీమ్​ఇండియా

By

Published : Dec 29, 2021, 10:01 PM IST

తొలి టెస్టులో టీమ్​ఇండియా పట్టు బిగిస్తోంది. నాలుగోరోజు ఆట పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా 94/4తో నిలిచింది. ఆతిథ్య జట్టు విజయానికి మరో 211 పరుగులు కావాల్సి ఉండగా.. భారత్​ 6 వికెట్లు తీస్తే గెలిచేస్తుంది. మరి గురువారం ఏం జరుగుతుందో చూడాలి.

అంతకు ముందు నాలుగోరోజు ఆట ప్రారంభించిన భారత్.. రెండో ఇన్నింగ్స్​లో 174 పరుగులకు ఆలౌటైంది. అత్యధికంగా పంత్ 34, కేఎల్ రాహుల్ 23 పరుగులు చేశారు. రబాడా, జేన్సన్​ తలో నాలుగు వికెట్లు తీశారు.

భారత బౌలర్లు

అనంతరం 305 పరుగులతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మార్క్రమ్ 1, పీటరన్స్ 17, వాన్ డర్​సన్ 11, కేశవ్ మహారాజ్ 8 పరుగులు చేశారు. కెప్టెన్ ఎల్గర్ 52 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. భారత జట్టు బుమ్రా 2, షమి, సిరాజ్ తలో వికెట్ తీశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details