తెలంగాణ

telangana

ETV Bharat / sports

'చాలా హ్యాపీ- నేను ఇది అస్సలు ఊహించలేదు!- విన్నింగ్ క్రెడిట్‌ వారికే' - భారత్​ సౌతాఫ్రికా వన్డే కేఎల్ రాహుల్

IND Vs SA First ODI 2023 KL Rahul : సౌతాఫ్రికాతో తొలివన్డేలో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని టీమ్​ఇండియా స్టాండింగ్ కెప్టెన్​ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఈ సిరీస్‌ యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం పొందేందుకు మంచి అవకాశమని చెప్పాడు.

IND Vs SA First ODI 2023 KL Rahul
IND Vs SA First ODI 2023 KL Rahul

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 9:36 AM IST

IND Vs SA First ODI 2023 KL Rahul :దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్​ను భారత క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్​ అనంతరం విజయంపై భారత స్టాండింగ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమ్​ఇండియా పేసర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. జూనియర్‌ టీమ్‌తో దక్షిణాఫ్రికా వంటి జట్టుపై గెలవడం అంత ఈజీ కాదు. కానీ మా కుర్రాళ్లు అందరి అంచనాలను తారుమారు చేశారు. ఈ మ్యాచ్‌లో అన్నీ మా ప్రణాళికలకు భిన్నంగా జరిగాయి. ఈ వికెట్‌పై తొందరగా స్పిన్నర్లను ఉపయోగించి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం. కానీ పిచ్‌ పూర్తిగా పేసర్లకు అనుకూలించింది. దీంతో మా పేసర్లు అదరగొట్టారు"

- కేఎల్​ రాహుల్, టీమ్​ఇండియా స్టాండింగ్​ కెప్టెన్​

వారికి మంచి అవకాశం!
"పిచ్​పై బంతి కూడా టర్న్‌ అ​యింది. ఇటీవల కాలంలో ప్రతీ ఒక్కరూ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఫార్మాట్‌కు ప్రాధ్యాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతానికి టెస్టులు, టీ20లకే ఆదరణ ఎక్కువగా ఉంది. అయితే ప్రతీ ఒక్కరూ దేశమే కోసం అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సిరీస్‌ యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం పొందేందుకు మంచి అవకాశం" అని రాహుల్ తెలిపాడు.

మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో భారత పేసర్ల ధాటికి కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పంజాబీ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 5 వికెట్లతో చెలరేగాడు. అవేశ్​ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఫెహ్లుక్వాయో(33) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్‌(55 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలతో టీమ్​ఇండియాను విజయ తీరాలకు చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details