తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SA: 'టెస్టు క్రికెట్​లోనూ ఫ్రీ హిట్​ రూల్​' - dale steyn cricket news

IND vs SA: టెస్ట్​ క్రికెట్​లోనూ ఫ్రీ హిట్ నియమాన్ని తీసుకురావాలని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ సూచనలు చేశాడు. ఈ విధానం వల్ల ఆఖరిలో బ్యాటింగ్​కు వచ్చే బౌలర్లు.. ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఉందన్నాడు.

dale steyn
డేల్ స్టెయిన్

By

Published : Jan 13, 2022, 9:30 AM IST

IND vs SA: పరిమిత ఓవర్ల మ్యాచ్​లో.. బౌలర్​ నో బాల్​ వేసినప్పుడు 'ఫ్రీ హిట్' అవకాశం ఉంటుంది. అంటే బౌలర్​ ఎక్స్​ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే 'ఫ్రీ హిట్' విధానాన్ని టెస్టు క్రికెట్​లోనూ తీసుకురావాలని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ సూచించాడు.

" టెస్ట్ క్రికెట్​లో బౌలర్ నో బాల్​ వేస్తే ఫ్రీ హిట్​ ఇవ్వాలి. ఇది కచ్చితంగా బ్యాటింగ్​ చేసే బౌలర్లకు ఉపయోగపడుతుంది. ఓవర్​కు 7/8 బంతులు, ఒక్కోసారి 9బంతులు కూడా చాశాం." అని స్టెయిన్ అన్నాడు.

'ముఖ్యంగా బౌలర్లు బ్యాటింగ్​ చేస్తున్నప్పుడు.. వాళ్లు టాప్​ క్లాస్​ పేసర్ల బౌలింగ్​ను తట్టుకోవాల్సిఉంటుంది.. ఈ క్రమంలో బౌలర్లకు ఆరు బంతులు సరిపోవు'అని స్టెయిన్​ అభిప్రాయపడ్డాడు. భారత్​- దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్​ జరుగుతున్న క్రమంలో స్టెయిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్​ఇండియా బౌలర్ బుమ్రా అద్భుత ప్రదర్శన(5/42)పై ప్రశంసలు కురిపించాడు.

ఫ్రీ హిట్ అంటే..?

పరిమిత ఓవర్ల మ్యాచ్​లో.. బౌలర్​ నో బాల్​ వేసినప్పుడు 'ఫ్రీ హిట్' అవకాశం ఉంటుంది. అంటే బౌలర్​ ఎక్స్​ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఈ బంతిని బ్యాట్స్​మన్​ ఎదుర్కొన్నప్పుడు కేవలం రనౌట్​ అయితేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

కానీ, సుదీర్ఘ ఫార్మాట్​లో ఇలా కాదు. బౌలర్​ చేసిన తప్పిదానికి బ్యాట్స్​మన్​ ఇబ్బందులు పడే సందర్భాలు ఎదురవుతాయి. ఒకవేళ బౌలర్​ నోబాల్ వేస్తే.. ఆ బంతిని లెక్కలోకి పరిగణించకుండా ఎక్స్​ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్స్​ట్రా బంతికి ఔట్​ అయినా బ్యాట్స్​మన్​ పెవిలియన్​కు చేరాల్సిందే.

ఇదీ చూడండి:'పంత్‌కు కాస్త భరోసా ఇస్తే చెలరేగి ఆడతాడు'

ABOUT THE AUTHOR

...view details