IND vs SA 3rd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. వాండరర్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు కేవలం 15.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు మూడో టెస్టుకు దాదాపుగా దూరమైనట్లే. కోచ్ ద్రవిడ్ కూడా అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేమని అన్నాడు. నిర్ణయాత్మక టెస్టుకు అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నదే ఇప్పుడు భారత జట్టు ముందున్న ప్రశ్న.
సిరాజ్ అందుబాటులో లేకుంటే అతను ఖాళీ చేసే స్థానం కోసం ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ పోటీ పడుతున్నారు. 100కు పైగా టెస్టులాడిన 33 ఏళ్ల ఇషాంత్ ఇటీవల కాలంలో అంతగా ఫామ్‌లో లేడు. 51 టెస్టులు ఆడిన ఉమేశ్ యాదవ్ ఈ మధ్య ఇషాంత్ కన్నా మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే కెప్టెన్ కోహ్లీ, కోచ్ ద్రవిడ్ ఇషాంత్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి అతడి ఎత్తు. 6 అడుగుల మూడున్నర అంగుళాల ఇషాంత్.. ఇబ్బందికర లెంగ్త్‌లతో బ్యాటర్లకు సమస్యలు సృష్టించగలడని భావిస్తున్నారు. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్లు జాన్సన్, ఒలీవర్ అదే చేశారు.