తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SA 3rd ODI: టాస్ గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ - భారత్ దక్షిణాఫ్రికా మూడో వన్డే లేటెస్ట్ న్యూస్

IND vs SA 3rd ODI: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మరికాసేపట్లో మూడో వన్డే ప్రారంభం కాబోతుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

IND vs SA 3rd ODI toss, భారత్ దక్షిణాఫ్రికా మూడో వన్డే టాస్
IND vs SA 3rd ODI

By

Published : Jan 23, 2022, 1:34 PM IST

Updated : Jan 23, 2022, 1:49 PM IST

IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా పర్యటన ముగింపునకు వచ్చేసింది. మరికొద్దిసేపట్లో రెండు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఈ మ్యాచ్​లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. కాగా, క్లీన్​స్వీప్​తో సిరీస్​ను ముగించాలని సౌతాఫ్రికా ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్​లో భారత్ నాలుగు మార్పులతో బరిలో దిగింది. సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చాహర్​ జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా మాత్రం ఒక మార్పు చేసింది. షంసీ స్థానంలో ప్రిటోరియస్​ను తీసుకుంది.

జట్లు

భారత్

రాహుల్ (కెప్టెన్), ధావన్, కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చాహర్, బుమ్రా, చాహల్

దక్షిణాఫ్రికా

మలన్, డికాక్, బవుమా, బవుమా, మర్క్​రమ్, వండర్ డసెన్, మిల్లర్, ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, ఎంగిడి, సిసంద మగాలా

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: 'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసిన రైనా.. బన్నీ నటనకు ఫిదా

Last Updated : Jan 23, 2022, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details