తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో ఇన్నింగ్స్​లో భారత్ 85/2... 58 పరుగుల ఆధిక్యం

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ముగిసేసరికి భారత్​ 58 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో రహానే(11), పుజారా(35) ఉన్నారు.

rahul, mayank
రాహుల్, మయాంక్

By

Published : Jan 4, 2022, 9:16 PM IST

IND vs SA 2nd Test: జోహెన్నెస్​బర్గ్​ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా 58 పరుగుల అధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్​ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్​.. 85 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఛెతేశ్వర్ పుజారా (35), అజింక్య రహానే(11) ఉన్నారు.

ఆరంభంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్​ను (8) పెవిలియన్​కు పంపాడు దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్. కొద్దిసేపటికి ఒలీవర్​ బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు మయాంక్ అగర్వాల్(23).

తొలి ఇన్నింగ్స్​లో దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డాడు భారత బౌలర్ శార్దుల్ ఠాకుర్. ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 202 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చదవండి:

IND vs SA 2nd Test: శార్దుల్​కు ఏడు వికెట్లు- సౌతాఫ్రికా 229 ఆలౌట్

ABOUT THE AUTHOR

...view details