రెండో టెస్టు సఫారీలదే..
రెండో టెస్టులో భారత్‌పై విజయం సాధించింది సౌతాఫ్రికా. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో టెస్టు కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.
21:24 January 06
రెండో టెస్టు సఫారీలదే..
రెండో టెస్టులో భారత్‌పై విజయం సాధించింది సౌతాఫ్రికా. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో టెస్టు కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.
19:15 January 06
మ్యాచ్ ప్రారంభం..
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.
సౌతాఫ్రికా బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. మరో 100 పరుగులు చేస్తే వారిని విజయం వరిస్తుంది. భారత్ 8 వికెట్లు పడగొడితే సిరీస్ నెగ్గుతుంది.
దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అర్ధశతకం చేశాడు.
18:46 January 06
7.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం
వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ 7.15 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రోజు 34 ఓవర్ల ఆట జరిగే అవకాశమున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీలైతే మరో అరగంట పాటు ఆటను కొనసాగించనున్నారు.
15:42 January 06
నాలుగో రోజు ఆట జరిగేనా?
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వర్షం కొనసాగుతుండటం వల్ల కాస్త ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వర్షం కారణంగా భోజన విరామం కూడా కాస్త ముందుగానే ప్రకటించారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్‌పై విజయం సాధించడానికి ప్రోటీస్ జట్టు ఇంకా 122 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(46), వాండర్ డసెన్(11) ఉన్నారు.