తెలంగాణ

telangana

ETV Bharat / sports

సమమా? సమర్పణమా?- సఫారీలతో రెండో టెస్ట్​కు భారత్ రెడీ- తుది జట్ల వివరాలివే! - భారత్ దక్షిణాఫ్రికాటైమ్

IND vs SA 2nd Test 2024 : భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండో టెస్టుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఈ సిరీస్‍ను టీమ్ఇండియా సమం చేసుకోగలుగుతుంది. మరి ఈ టెస్ట్ మ్యాచ్​కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

IND vs SA 2nd Test 2024
IND vs SA 2nd Test 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 7:13 AM IST

IND vs SA 2nd Test 2024 :దక్షిణాఫ్రికా పర్యటనలో చివరి మ్యాచ్​కు టీమ్​ఇండియా రెడీ అయింది. భారత్​, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం నుంచే రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్‍లో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్‍లో ఘోరంగా ఓడి 0-1తో భారత్ వెనుకబడింది. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని మరోసారి మిస్ చేసుకుంది. ఈ రెండో టెస్టులో గెలిస్తేనే సిరీస్‍ను భారత్ సమం చేసుకోగలుగుతుంది. ఈ మ్యాచ్ టైమింగ్స్, లైవ్, తుది జట్లు వివరాలు ఇవే.

టైమ్, వేదిక
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు బుధవారం (జనవరి 3) మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆట మొదలుకానుంది. కేప్‍టౌన్‍లోని న్యూల్యాండ్స్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

లైవ్ వివరాలు
టీమ్​ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

పిచ్, వాతావరణం
కేప్‍టౌన్‍లో జరిగే ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం ఉండే అవకాశం చాలా తక్కువ. రెండో టెస్టు జరిగే ఐదు రోజులు ఆటకు వాన ఆటంకం కలిగించకపోచ్చు. ఇక, భారత్, దక్షిణాఫ్రికా తలపడే కేప్‍టౌన్ పిచ్ పేసర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. పిచ్‍పై పచ్చిక ఉంది. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు కూడా ఛాన్స్ లభిస్తుంది.

తుది జట్లు ఇలా..
భారత స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి ఫిట్‍నెస్ సాధించాడు. దీంతో రెండో టెస్టు తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జడేజా వచ్చేయనున్నాడు. తొలి టెస్టులో విఫలమైన యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను భారత మేనేజ్‍మెంట్ కొనసాగిస్తుందా లేకపోతే ముకేశ్ కుమార్‌కు అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. అలాగే గాయం వల్ల ఈ మ్యాచ్‍కు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా దూరం కానున్నాడు. డీన్ ఎల్గర్ కెప్టెన్సీ చేయనున్నాడు.

భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/ముకేశ్ కుమార్

దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా): డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రమ్, టోనీ డీ జోర్జీ, కీగన్ పీటర్సన్, జుబైర్ హంజా, డేవిడ్ బెడిన్‍గమ్, కేల్ వెర్రైన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ / లుంగీ ఎంగ్డీ, కగిసో రబాడ, నాడ్రే బర్గర్

ఈ రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై గెలిస్తే సిరీస్‍ను భారత్ సమం చేసుకోవచ్చు. ఒకవేళ డ్రా అయినా, ఓడినా సఫారీ జట్టుకే ఈ రెండు టెస్టుల సిరీస్ దక్కుతుంది. ఈ మ్యాచ్ గెలవాలంటే సఫారీ పేసర్లు రబాడ, బర్గర్, జాన్సెన్‍ను భారత బ్యాటర్లు దీటుగా ఎదుర్కోవాల్సిందే. ఈ మ్యాచ్‍తోనే దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా పర్యటన ముగియనుంది.

రోహిత్ పుల్, ధోనీ హెలికాప్టర్, విరాట్ కవర్ డ్రైవ్- క్రికెట్​లో బెస్ట్ సిగ్నేచర్ షాట్స్ ఇవే!

టీ20 వరల్డ్​కప్​ జట్టు ఎంపిక కోసం బీసీసీఐ తీవ్ర కసరత్తులు- రోహిత్​, కోహ్లీతో చర్చలు!

ABOUT THE AUTHOR

...view details