తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SA ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా - భారత్ దక్షిణాఫ్రికా రెండో వన్డే ప్రివ్యూ

IND vs SA 2nd ODI: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మరికొద్దిసేపట్లో రెండో వన్డే ప్రారంభంకానుంది. కాగా ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs SA ODI toss, భారత్ దక్షిణాఫ్రికా వన్డే టాస్
IND vs SA ODI

By

Published : Jan 21, 2022, 1:34 PM IST

Updated : Jan 21, 2022, 1:43 PM IST

IND vs SA 2nd ODI: టెస్టు సిరీస్‌ను కోల్పోయి, కనీసం వన్డే సిరీస్‌నైనా చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోన్న టీమ్‌ఇండియా కీలకమైన రెండో వన్డేలో శుక్రవారం దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఒత్తిడిలో భారత్..

తొలి వన్డేలో ఓడిన టీమ్ఇండియా ఒత్తిడిలో పడిపోయింది. ఇలాంటి సమయంలో తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్​ జట్టును ఏ విధంగా ముందుండి నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించాలని యాజమాన్యం భావిస్తోంది.

జోరుమీద సఫారీలు..

పర్యటనను భారతే ఫేవరెట్‌గా ఆరంభించినా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న దక్షిణాఫ్రికా చాలా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. రెట్టించిన విశ్వాసంతో ఉంది. పెద్దగా సూపర్‌స్టార్లు లేకున్నా సమష్టిగా రాణిస్తోంది. తొలి వన్డేలో సెంచరీలతో మెరిసిన వాండర్‌డసెన్‌, కెప్టెన్‌ బవుమా అదే జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. బౌలింగ్‌లో ఆ జట్టుకు ఇబ్బందులేమీ లేవు. స్పిన్నర్లు, పేసర్లు చక్కగా రాణిస్తున్నారు.

జట్లు

భారత్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), ధావన్, కోహ్లీ, పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్

దక్షిణాఫ్రికా

డికాక్, జన్నేమన్ మలన్, టెంబా బవుమా (కెప్టెన్), మర్క్​రమ్, వండర్ డసెన్, మిల్లర్, ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, సిసండ మగలా, షంసీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి

'రెండో వన్డేలో గెలవాలంటే వారిని ఆడించండి'

టీమ్ఇండియా మాజీ స్పిన్నర్​ హర్భజన్​కు కరోనా

Last Updated : Jan 21, 2022, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details