IND vs SA ODI: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. పంత్ (85), రాహుల్ (55) అర్ధసెంచరీలతో రాణించారు.
IND vs SA ODI: పంత్ ఫైర్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 288 - పంత్ అర్ధసెంచరీ
IND vs SA ODI: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా సఫారీల ముందు 288 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ధావన్, రాహుల్ శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అనంతరం ధావన్ (29)ను పెవిలియన్ చేర్చాడు మర్క్రమ్. తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పంత్‌తో కలిసి రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ సఫారీ బౌలర్లను కాచుకుని పరుగుల వేట సాగించారు. ఈ క్రమంలోనే ఇరువురు అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం రాహుల్ (55) ఔటయ్యాడు. సెంచరీ దిశగా దూసుకెళ్లిన పంత్ (85)ను పెవిలియన్ పంపాడు షంసీ. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (22), శ్రేయస్ అయ్యర్ (11) భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. చివర్లో శార్దూల్ ఠాకూర్ (40*), అశ్విన్ (25*) కాసేపు పోరాడటం వల్ల ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.