తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SA 2021: వారి అహం క్రికెట్ కంటే గొప్పదా?.. అభిమానులు ఫైర్! - రోహిత్ శర్మ కెప్టెన్

IND vs SA 2021: టీమ్​ఇండియా జట్టు త్వరలోనే దక్షిణాఫ్రికాకు పర్యటించనుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ నిర్ణయాలపై మండిపడుతున్నారు.

rohit, virat
రోహిత్, విరాట్

By

Published : Dec 14, 2021, 10:54 PM IST

IND vs SA 2021: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టీమ్​లో గందరగోళం నెలకొంది. ప్రాక్టీస్ సెషన్​లో గాయాలైన కారణంగా టెస్టు సిరీస్​కు హాజరుకాలేనని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐకి తెలిపాడు. మరోవైపు వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్​కు విరాట్​ కోహ్లీ దూరంకానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్-రోహిత్​ మధ్య బేధాభిప్రాయాలున్నాయంటూ చర్చలు జరుగుతున్నాయి.

ఇటీవలే వన్డే జట్టుకు సారథిగా విరాట్ కోహ్లీని తొలగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్​ బాధ్యతలను రోహిత్​కు అప్పగించింది. అయితే.. దీనిపై విరాట్​నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం తలెత్తిన తాజా పరిస్థితుల నేపథ్యంలో.. టీమ్​ఇండియా జట్టులో ఏం జరుగుతుందో అర్థంకాక అభిమానులు సతమతమవుతున్నారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా.. టెస్టుల్లో విరాట్ సారథ్యంలో రోహిత్, వన్డేల్లో రోహిత్ సారథ్యంలో విరాట్​ ఆడాల్సి ఉంటుంది. ఇది ఇష్టంలేకే వారు సిరీస్​ నుంచి తప్పుకుంటున్నారని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐపై, కోహ్లీపై మండిపడుతున్నారు.

ఈ పరిణామాన్ని 'అవార్డు విన్నింగ్​ స్క్రిప్ట్​' అని ఓ యూజర్​ అభివర్ణించాడు. బీసీసీఐపై తన ఆవేదన వ్యక్తపరిచాడు. 'మా పెళ్లికి మీరు రాలేదు కాబట్టి, మీ పెళ్లికి మేం రాం అన్నట్లుగా ఉంది పరిస్థితి' అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.

'క్రికెట్​ కంటే ఎవరూ గొప్పవాళ్లు కాదు. కాని కొందరు క్రికెటర్లు వారి అహం చాలా గొప్పదని భావిస్తున్నట్లున్నారు' అని ఓ నెటిజన్ మండిపడ్డాడు. కాగా, విరాట్​ కోహ్లీ వన్డే సిరీస్​ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐకి అధికారికంగా చెప్పలేదని అవన్నీ గాలి వార్తలే అని ఓ అధికారి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'రోహిత్-విరాట్ వివాదం.. బ్రేక్​ తీసుకున్న సమయమే తప్పు'

Virat Kohli Break: 'వన్డే సిరీస్​కు విశ్రాంతి కావాలని కోహ్లీ కోరలేదు'

SA vs IND Test: 'అసలేం జరుగుతోంది.. దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేయాలా?'

ABOUT THE AUTHOR

...view details