IND vs SA 1st Test: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ తొలి రోజు ఆటలో టీమ్ఇండియా ఆధిపత్యం ప్రదర్శించింది. ఆటముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగలు చేసింది. అయితే ఈ అద్భుత ప్రదర్శన.. క్రమశిక్షణ, ప్రణాళికబద్ధమైన చర్యల వల్లే ఇది సాధ్యమైందని అన్నాడు మయాంక్ అగర్వాల్.
"బ్యాటర్లుగా మమల్ని మేము అన్వయించుకున్నాం. క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా ఆటను ఆడాం. ఆట ఆరంభంలో పిచ్‌పై కాస్త తేమగా ఉంది. అందుకే కొన్ని బంతులు బ్యాట్‌కు దూరంగా వచ్చాయి. కొంతసేపటి తర్వాత బ్యాట్ మీదకు బంతి రావడం మొదలైంది. తద్వారా భారీ స్కోరు నమోదు చేయడం సాధ్యమైంది. ఇక ఈ భారీ స్కోరులో భాగస్వామ్యాలు కీలకంగా వ్యవహరించాయి. మొదట నేను, రాహుల్ ఆ తర్వాత కోహ్లీ, రహానెతో అతడు నమోదు చేసిన భాగస్వామ్యాలు చాలా కీలకం. క్రీజులో ఎలా పాతుకుపోవాలో ఇతర బ్యాటర్లు రాహుల్ నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే తన ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉంది అనేది అతడు బాగా అర్ధంచేసుకున్నాడు. బంతులను సరిగ్గా బాదాడు. తన ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణగా ఆడాడు."