తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind Vs Pak World Cup 2023 : అప్పుడేమో హోటళ్లు, ఇప్పుడు ఫ్లైట్లు.. భారత్​-పాక్ మ్యాచ్​ కోసం టికెట్ ధరలు అంత పెరిగాయా? - అహ్మదాబాద్​ ఫ్లైట్​ టికెట్ల్స్​

Ind Vs Pak World Cup 2023 : అక్టోబర్ 14న జరగనున్న భారత్​- పాక్​ పోరుకు సర్వం సిద్ధమౌతోంది. ఈ ప్రతిష్టాత్మక పోరుకు ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున.. ఫ్యాన్స్​ కూడా అహ్మద్​కు పయనమయ్యేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్​కున్న డిమాండ్​ వల్ల ఇప్పటికే అక్కడున్నహోటళ్ల ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అహ్మదాబాద్​ ఫ్లైట్​ టిక్కెట్ల ధర చూసిన అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు.

Ind Vs Pak World Cup 2023
Ind Vs Pak World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 1:05 PM IST

Updated : Sep 23, 2023, 1:19 PM IST

Ind Vs Pak World Cup 2023 : అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న భారత్​- పాక్ ప్రపంచ కప్​ పోరుకు ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. టిక్కెట్ల అమ్మకం నుంచి రూమ్స్​ అద్దె వరకు అన్నీ సగటు క్రికెట్​ అభిమానిని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరుకు ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున.. ఫ్యాన్స్​ కూడా అహ్మదాబాద్​కు పయనమయ్యేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్​ చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు వల్ల అక్కడి హోటళ్ల ధరల్లోనూ మార్పులు జరిగాయి. ఇక ఇదే విషయాన్ని అదునుగా చేసుకున్న వ్యాపారస్థులు.. ఇప్పటికే హోటళ్ల ధరలను అమాంతం పెంచేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అహ్మదాబాద్​ ఫ్లైట్​ టిక్కెట్ల ధర కూడా అమాంతం పెరిగిపోయిందట. అసలు ఛార్జీలు రూ.5,000 - రూ.12,000 ఉండగా.. దానికంటే 104 శాతం నుంచి 415 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారట. దీంతో మ్యాచ్​ చూసేందుకు విమాన ప్రయాణం చేయనున్న అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. డిమాండ్​కు తగ్గట్లుగా కావాల్సినన్ని ఫ్లైట్లు అందుబాటులో లేకపోవడం కూడా ఈ ధరల పెరుగుదలకు ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

World Cup 2023 Inaugural Match :అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్​నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్​ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెగా టోర్నీ డిఫెండింగ్​ ఛాంపియన్​ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ్యాచ్​తో ప్రారంభం కానుంది. ఈ పోరుకు అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదిక కానుంది.

Golden Ticket World Cup 2023 : అయితే వరల్డ్ కప్​లో బీసీసీఐ..'గోల్డెన్ టికెట్స్​ ఫర్ ఇండియా ఐకాన్స్​' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా భారతరత్న సచిన్ తెందూల్కర్​, బాలీవుడ్ బిగ్​బి అమితాబ్​ బచ్చన్​, తమిళ సూపర్ స్టార్​ రజనీకాంత్​కు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ గోల్డెన్ టికెట్ అందజేశారు. అయితే ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారు, ప్రపంచకప్​లోని అన్ని మ్యాచ్​లను స్టేడియంలో ప్రత్యక్షంగా.. వీఐపీ బాక్స్​లో కూర్చొని వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ టికెట్​పై.. వారికి వీఐపీ వసతులన్నింటినీ కల్పిస్తారు. ఈ క్రమంలో సచిన్, అమితాబ్​కు ఈ టికెట్ అందింది. ఇక మున్ముందు ఈ గోల్డెన్ టికెట్లను దేశంలోని ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ICC World Cup History : 10 జట్లు.. ఒకే వరల్డ్​ కప్​​.. ఎవరు తయారు చేశారో తెలుసా?.. కాస్ట్​ ఎంతంటే?

World Cup 2023 Prize Money : వామ్మో.. వరల్డ్ కప్​ విజేత 'ప్రైజ్​మనీ' ఎంతో తెలిస్తే షాకే!

Last Updated : Sep 23, 2023, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details