తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs PAK T20: 'పాక్​కు భారత్ భయపడింది.. అందుకే ఓటమి' - IND vs PAK T20 viewership

IND vs PAK T20: టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో మ్యాచ్​కు ముందు టీమ్ఇండియా ఒత్తిడికి గురైందని తెలిపాడు పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్. భయం వల్లే ఈ మ్యాచ్​లో కోహ్లీసేన ఓడిపోయిందని వెల్లడించాడు.

IND vs PAK T20  Inzamam ul Haq , IND vs PAK T20 viewership, భారత్-పాక్ టీ20 ఇంజమామ్, భారత్-పాక్ టీ20 రికార్డు
IND vs PAK

By

Published : Nov 26, 2021, 3:10 PM IST

IND vs PAK T20: టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఘోర ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. పొట్టి ప్రపంచకప్​లో పాక్​పై భారత్​కు ఎదురేలేదంటూ గర్వంగా చెప్పుకొన్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ మ్యాచ్​లో దాయాది జట్టుకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది భారత్. దీంతో ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీసేనపై గట్టి విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ మ్యాచ్​లో భారత్ ఓటమి గురించి స్పందించిన పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam Ul Haq on India).. పాక్​తో మ్యాచ్​కు ముందే భారత్ భయపడిందని తెలిపాడు.

"పాక్​తో మ్యాచ్​ మొదలవ్వకముందే భారత జట్టు భయపడినట్లు కనపడుతోంది. టాస్​ సమయంలో కోహ్లీ, బాబర్ అజామ్ ఇంటర్వ్యూ దగ్గర వారి బాడీ లాంగ్వేజ్​ను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. పాక్ కంటే భారత్ చాలా ఒత్తిడిలో కనిపించింది. రోహిత్ శర్మ ఔటయ్యాక కాదు.. మ్యాచ్ మొదలుకాక ముందే భారత్ ఒత్తిడిలో పడింది. టీమ్ఇండియా గొప్ప టీ20 జట్టు. కానీ ఈ మ్యాచ్​లో వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. పాక్​తో ఓడిపోయాక వారిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మరింత ఒత్తిడికి గురయ్యారు. న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో స్పిన్నర్లు ఇష్ సోధి, శాంట్నర్​లను కూడా వారు ఎదుర్కోలేకపోయారు."

-ఇంజమామ్, పాక్ మాజీ క్రికెటర్

ఈ మెగాటోర్నీలో తొలి రెండు మ్యాచ్​ల్లో పాక్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి సెమీస్ రేసులో వెనకపడింది టీమ్ఇండియా. చివరి మూడు మ్యాచ్​ల్లో అఫ్గాన్, నమీబియా, స్కాట్లాండ్​పై గెలిచినా.. రన్​రేట్ తక్కువైన కారణంగా సెమీస్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది.

భారత్-పాక్ మ్యాచ్ రికార్డు

IND vs PAK T20 viewership: ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్​కు(IND vs PAK T20 viewers) విశేష ఆదరణ లభించింది. ఏకంగా 167 మిలియన్ల (16.7 కోట్లు) మంది ఈ మ్యాచ్​ వీక్షించినట్లు ఐసీసీ తెలిపింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్​ను ఇంతమంది వీక్షించడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

ఇవీ చూడండి: టీమ్​ఇండియా బౌలర్ ఆగ్రహం.. అంపైర్​పై కోపంతో..

ABOUT THE AUTHOR

...view details