IND VS PAK Rizwan: భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు పరస్పరం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారని దాయాది జట్టు బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం తలపడాలనుకుంటున్నారని, అయితే.. దౌత్యపరమైన విషయాలు క్రికెటర్ల చేతుల్లో లేవని చెప్పుకొచ్చాడు. మరోవైపు టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ ఛేతేశ్వర్ పుజారాపైనా రిజ్వాన్ ప్రశంసలు కురిపించాడు.
'భారత్, పాక్ ప్లేయర్స్ తలపడాలనుకుంటున్నారు' - పుజారా
IND VS PAK Rizwan: భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు పరస్పరం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారని పాక్ జట్టు బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అన్నాడు. మరోవైపు టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ ఛేతేశ్వర్ పుజారాపైనా రిజ్వాన్ ప్రశంసలు కురపించాడు.
"నేను ససెక్స్ టీమ్‌తో ఆడినప్పుడు పుజారాతో కలిసి ముచ్చటించాను. క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలు చర్చించాను. దాంతో అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆటగాళ్లుగా మాది ఒకటే కుటుంబం. మా మాధ్య విభేదాలు లేవు. పుజారా చాలా మంచి వ్యక్తి. అతడి ఏకాగ్రత, పట్టుదలంటే నాకెంతో ఇష్టం. తన బ్యాటింగ్‌ను ఆరాధిస్తాను. బ్యాటింగ్ విషయంలో యూనిస్ ఖాన్, ఫవాద్ ఆలమ్, పుజారాలకు నేను అత్యుత్తమ రేటింగ్ ఇస్తాను" అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన కౌంటీ క్రికెట్‌లో పుజారా, రిజ్వాన్ ఇద్దరూ ససెక్స్‌టీమ్ తరఫున ఆడారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ టోర్నీలో వీరిద్దరూ కలిసి బ్యాటింగ్ కూడా చేశారు.
ఇదీ చూడండి:చరిత్రాత్మక సిరీస్‌పై డాక్యుమెంటరీ.. ట్రైలర్ విడుదల చేసిన టీమ్ఇండియా