Ind vs Pak Asia Cup 2023 :2023 ఆసియా కప్‌లో ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారత్-పాకిస్థాన్మ్యాచ్ను.. వరుణుడు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం నిరాశకు లోనైంది. అయితే ముందు నుంచి అంటున్నట్లుగానే ఈ మినీ టోర్నమెంట్లో దాయాదుల మధ్య మరో సమరం ఉండే ఛాన్స్ ఉంది. మరి అది ఎలా సాధ్యం అంటే?
గత రెండు సీజన్లలో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌ను.. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు జరుపుతున్నారు. ఇందులో రెండు గ్రూపుల్లో నుంచి చివరి ప్లేస్‌లో ఉన్న టీమ్స్ నిష్క్రమిస్తాయి. ఈ క్రమంలో భారత్, తదుపరి మ్యాచ్ నేపాల్‌తో ఆడనుంది. ఇరుజట్ల మధ్య పోరు సోమవారం ఉండనుంది. ఇక ఈ మ్యాచ్‌కు కూడా పల్లెకెలె మైదానం వేదిక కానుంది. ఈ పోరులో భారత్ గెలుపు దాదాపు ఖాయమేనని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. మూడు పాయింట్లతో గ్రూప్-ఏ లో పాక్ తర్వాత రెండో స్థానంలో నిలుస్తుంది.
దీంతో షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 10న మరోసారి ఇండోపాక్ మ్యాచ్‌ను చూడవచ్చు. కానీ నేపాల్‌తో గెలుపు అనంతరమే ఈ మ్యాచ్ అధికారికంగా ఫిక్స్ అవుతుంది. ఇక సూపర్ 4 దశలో రెండు జట్లు అదరగొడితే.. ఫైనల్స్‌లో ముచ్చటగా మూడోసారి కూడా భారత్ పాక్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది.