Ind vs Pak Asia Cup 2023 :ఆసియా కప్ 2023లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసిన భారత్ ఆలౌటైంది. టాపార్డర్ ఫెయిలైనప్పటికీ.. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ (82 పరుగులు), హార్దిక్ పాండ్య (87 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించి.. భారత్‌కు పోరాడగలిగే స్కోర్‌ను కట్టబెట్టారు. ఈ క్రమంలో వీరు పలు రికార్డులు బద్దలుగొట్టారు. అవేంటంటే..
ఆ రికార్డు కొట్టేశారు..
India 5th Wicket Partnership In Asia Cup :భారత్ 66-4 స్థితిలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య, ఇషాన్‌తో జతకట్టాడు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకొని, స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు.. ఇదే ఐదో వికెట్ అత్యుత్తమ పార్ట్నర్షిప్. అయితే ఇదివరకు ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్-యువరాజ్ సింగ్ పేరిట ఉంది. వీరు 2004 ఆసియా కప్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించారు.