Ind Vs Pak Asia Cup 2023 : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రోజు వచ్చేసింది. భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. హోరా హోరీగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలుచుకున్న టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
Rohit Sharma Asia Cup 2023 : మరోవైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై మెరుపు శతకం బాదిన రోహిత్.. ఇప్పుడు కెప్టెన్‌గా అలాంటి ఇన్నింగ్స్‌తోనే జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. తొలిసారి పాక్‌ను ఎదుర్కొనబోతున్న శుభ్‌మన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన విషయం. ఇక గాయం తర్వాత పునరాగమనం చేస్తున్న శ్రేయస్ అయ్యర్ మీద కూడా అందరి దృష్టి పడింది. మిడిలార్డర్లో హార్దిక్ కీలకం కానున్నాడు. జడేజా కూడా చివర్లో మెరుపులు మెరిపిస్తాడని జట్టు ఆశిస్తోంది.
Virat Innigs In Asia Cup :అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే బ్యాటింగ్‌లో అందరి దృష్టీ కోహ్లి మీదికే మళ్లుతుంది. ఆ జట్టుపై అతడికి మంచి రికార్డుంది. పాక్‌పై 13 వన్డేల్లో 48.72 సగటుతో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా 536 పరుగులు చేశాడు విరాట్. టీ20ల్లో ఆ జట్టుపై 10 మ్యాచ్‌లాడి 81.33 సగటుతో 488 పరుగులు సాధించాడు.