Mohmammed siraj on Rosstaylor wicket: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ రాస్‌టేలర్‌ను(1) ఔట్ చేసిన బంతి.. తన డ్రీమ్ డెలివరీ అని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. శనివారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటయ్యాక కివీస్ బరిలోకి దిగి 62 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ సిరాజ్ తొలి స్పెల్‌లోనే బెంబేలెత్తించాడు. అతడు టాప్ ఆర్డర్‌లోని మూడు ప్రధాన వికెట్లు పడగొట్టి టీమ్‌ఇండియా ఆధిపత్యం చెలాయించడంలో కీలక పాత్ర పోషించాడు.
తొలుత నాలుగో ఓవర్ బౌలింగ్ చేసిన సిరాజ్.. ఓపెనర్లు విల్‌యంగ్ (4), టామ్‌లాథమ్‌ను(10) పెవిలియన్ పంపాడు. తన తర్వాతి ఓవర్‌లో రాస్ టేలర్(1)నూ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం అశ్విన్ 4, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీయడం వల్ల న్యూజిలాండ్ అత్యల్ప స్కోరుకే పరిమితమైంది. మ్యాచ్ అనంతరం రాస్‌టేలర్‌ను ఔట్ చేసిన విధానంపై అక్షర్ పటేల్ అడిగిన ప్రశ్నకి అతడిలా సమాధానమిచ్చాడు.