IND vs NZ Test: భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన రెండో టెస్టులో ఓ విశేషం ఉంది. ప్రెస్‌బాక్స్‌లో విలేకర్లకు సాయంగా ఉండే ఇద్దరు స్కోరర్లు కూడా మహిళలు కావడమే అందుకు కారణం. క్షమ సానె, సుష్మా సావంత్ వాంఖెడేలో శుక్రవారం ఆరంభమయ్యే మ్యాచ్‌లో ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఓ టెస్టు మ్యాచ్‌కు స్కోరర్లుగా ఇద్దరు మహిళలే ఉండడం ఇది రెండోసారి. గతంలో సౌరాష్ట్రకు చెందిన హేమాలి, సెజల్ ఈ పని చేశారు.
IND VS NZ TEST: రెండో టెస్టుకు మహిళా స్కోరర్లు
IND vs NZ Test: భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన రెండో టెస్టులో ఓ విశేషం ఉంది. ప్రెస్‌బాక్స్‌లో విలేకర్లకు సాయంగా ఉండే ఇద్దరు స్కోరర్లు కూడా మహిళలు కావడం గమనార్హం. ఓ టెస్టు మ్యాచ్‌కు స్కోరర్లుగా ఇద్దరు మహిళలే ఉండడం ఇది రెండోసారి.
1990ల్లో క్షమ అండర్-15 స్థాయిలో ముంబయి తరపున క్రికెట్ ఆడింది. కానీ ఆ తర్వాత ఆట వదిలేసింది. అంపైర్ కోర్సు పూర్తి చేసినా ఆ వృత్తిని చేయలేదు. చివరగా 2010లో బీసీసీఐ మహిళల ప్రత్యేక బ్యాచ్ స్కోరింగ్ పరీక్షలో పాసై స్కోరర్‌గా మారింది. 45 ఏళ్ల క్షమ ఇప్పటివరకూ ఎన్నో ఐపీఎల్, రంజీ, జూనియర్, సీనియర్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా పనిచేసింది. కాగా, 2010లోనే బీసీసీఐ ప్రత్యేక స్కోరింగ్ కోర్సు పూర్తి చేసిన 50 ఏళ్ల సుష్మ 2013 మహిళల ప్రపంచకప్‌లో స్కోరర్‌గా విధులు నిర్వర్తించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఐపీఎల్‌తో పాటు బీసీసీఐ జూనియర్, సీనియర్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా పని చేసింది. ఇప్పుడు తొలిసారి టెస్టు మ్యాచ్‌లో ఆ పాత్ర పోషించనుంది.