ind vs nz test 2021: ముంబయి వేదికగా నవంబరు 3 నుంచి టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో (చివరి) టెస్టు ప్రారంభంకానుంది. తొలి టెస్టులో భారత్ విశ్వప్రయత్నం చేసినా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం (105) బాదిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ప్రదర్శనతో అతడు రెండో టెస్టుకు తుది జట్టులో చోటును దాదాపు ఖాయం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ గురించి న్యూజిలాండ్ వైస్ కెప్టెన్ టిమ్ సౌథీ మాట్లాడాడు. శ్రేయస్ అయ్యర్ ముప్పును ఎదుర్కోవడానికి కివీస్ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని సౌథీ అన్నాడు. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో శ్రేయస్ ఆటతీరును చూసిన తర్వాత అతడి గురించి మరింత సమాచారం తెలుసుకున్నామని పేర్కొన్నాడు.
శ్రేయస్ అయ్యర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: సౌథీ - shreyas iyer news
ind vs nz test 2021: శ్రేయస్ అయ్యర్‌ను ఎదుర్కోవడానికి కివీస్ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని న్యూజిలాండ్ వైస్ కెప్టెన్ సౌథీ అన్నాడు. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో శ్రేయస్ ఆటతీరును చూసిన తర్వాత అతడి గురించి మరింత సమాచారం తెలుసుకున్నామని పేర్కొన్నాడు.
'అరంగేట్ర మ్యాచ్‌లోనే శ్రేయస్ అయ్యర్ ఆత్మ విశ్వాసంతో అసాధారణమైన రీతిలో ఆడాడు. ఇది అద్భుతం. తొలి మ్యాచ్‌లో అతడి ఆటతీరును చూశాం. కాబట్టి, ఇప్పుడు అతని గురించి మరింత సమాచారం ఉందని నేను అనుకుంటున్నాను. నెమ్మదిగా ఉండే పిచ్‌లపై షార్ట్ బాల్‌తో టార్గెట్ చేయడం అంత సులభం కాదు. మేము మా ప్రణాళికలను పరిశీలిస్తాం. టీమ్‌ఇండియా మంచి బ్యాటింగ్ లైనప్‌ని కలిగి ఉంది' అని సౌథీ అన్నాడు.ఇదిలా ఉండగా, రెండో టెస్టు తొలి రోజు శుక్రవారం ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోజంతా వర్షం పడడంతో బుధవారం రెండు జట్ల ప్రాక్టీస్ సెషన్లు రద్దయ్యాయి. మ్యాచ్ జరిగే వాంఖడే స్టేడియంలోని పిచ్ సీమర్లతో పాటు స్పిన్నర్లకూ అనుకూలిస్తుందని భావిస్తున్నారు. భారత్ ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో లేదా ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోన్న విషయం.