mayank agarwal century in test: టీమ్ఇండియా-న్యూజిలాండ్ రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. డారిల్ మిచెల్ వేసిన 58.1 బంతికి ఫోర్ కొట్టి మయాంక్ అగర్వాల్ (100) శతకం అందుకున్నాడు. ఇది మయాంక్‌కు టెస్ట్ కెరీర్‌లో నాలుగో సెంచరీ.
ind vs nz test: మయాంక్ అగర్వాల్ సెంచరీ- టెస్టుల్లో నాలుగో శతకం - mayank agarwal century
ind vs nz test 2021: వాంఖడే వేదికగా జరుగుతున్న టీమ్ఇండియా-న్యూజిలాండ్ రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ సెంచరీతో సత్తాచాటాడు. నిలకడగా ఆడుతూ కీలకమైన సమయంలో జట్టును ఆదుకున్నాడు.
![ind vs nz test: మయాంక్ అగర్వాల్ సెంచరీ- టెస్టుల్లో నాలుగో శతకం mayank agarwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13806960-thumbnail-3x2-img.jpg)
మయాంక్ అగర్వాల్
ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ నిలకడగా రాణించాడు. గిల్(48)కే వెనుదిరిగాక.. తర్వాత వచ్చిన సీనియర్లు పుజారా, కోహ్లీ డకౌట్‌తో పెవిలియన్ చేరారు. ఇలాంటి కీలక సమయంలో మయాంక్ జట్టును ఆదుకున్నాడు. టీ బ్రేక్ సమయానికి అర్ధ సెంచరీ పూర్తి చేసి బౌలర్లను ఇరుకున పెట్టాడు. 196 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌ల సహాయంతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్, వృద్ధీమాన్ సాహా నిలకడగా ఆడుతున్నారు.
ఇదీ చదవండి:ind vs nz test: మయాంక్ అర్ధ శతకం.. టీ బ్రేక్ సమయానికి భారత్ 111/3
Last Updated : Dec 3, 2021, 6:31 PM IST