సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఒకే ఒక్క స్టిల్‌తో రాత్రికిరాత్రే సెలబ్రెటీలు అవుతున్న వారూ ఉన్నారు. మీమర్స్ అయితే వెంటనే తమ టాలెంట్‌కు పదునుపెట్టేస్తారు. కొత్త ఐడియాలతో ఆ ఫొటోకు వ్యాఖ్యలు జోడించి మరీ ఊదరగొట్టేస్తారు. అయితే ఒక్కోసారి ఆ ఇమేజ్‌తో లేనిపోని కష్టాలను కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితులూ వస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి అనుభవమే కాన్పూర్ వాసికి ఎదురైంది.
IND vs NZ Test: అది గుట్కా కాదు బాబు.. స్వీట్ సుపారీ అంతే! - షోబిత్ పాండే కాన్పూర్ టెస్టు
Kanpur Test Gutka Man: భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న సమయంలో ఓ అభిమాని నెట్టింట తెగ వైరల్‌గా మారాడు. నోట్లో ఏదో నములుతూ స్టైల్‌గా ఫోన్లో మాట్లాడటం టీవీ స్క్రీన్ల మీద చూసిన నెటిజన్లు అతడిని ఓ ఆటాడేసుకున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఆ యువకుడు.
Kanpur Test Gutka Man: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ఓ వ్యక్తి నోట్లో ఏదో నములుతూ స్టైల్‌గా ఫోన్లో మాట్లాడటం టీవీ స్క్రీన్ల మీద దర్శనమిచ్చింది. ఇక అంతే పాపం క్రికెట్ చూడటానికి వచ్చిన ఆ యువకుడిని నెటిజన్లు ఫుట్‌బాల్ ఆడుకున్నట్లు ఆడేసుకున్నారు. అతడు గుట్కా నములుతూ అలా ఫోన్లో మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించారు. మీమర్స్ అయితే చెలరేగిపోయారు. దీంతో ఒక్కసారిగా కుర్రాడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయాడు.
Shobhit Pandey Kanpur: ఎట్టకేలకు ఈ ఘటనపై యువకుడు స్పందించాడు. "అయ్యబాబోయ్ నేను గుట్కా నమలలేదు. ఏదో స్వీట్ సుపారీ పలుకులు మాత్రమే తిన్నా. నాకు గుట్కా తినే అలవాటే లేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో నా సోదరి కూడా ఉండటం, ఆమెపై కూడా కామెంట్లు రావడం బాధగా ఉంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు" అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. ఇంతకీ ఇతగాడి పేరు షోబిత్ పాండే అంట. ఆ రోజు తన సోదరి ఇచ్చిన స్వీట్ సుపారీని మాత్రమే తిన్నానని చెప్పుకొచ్చాడు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి..