న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా మెడ నొప్పి కారణంగా శనివారం మైదానంలోకి రాలేదు. అతడి స్థానంలో కీపింగ్ చేసిన కేఎస్ భరత్(KS Bharat Latest News) తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. చురుగ్గా వ్యవహరించిన అతడు ముగ్గురు కివీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయంపై స్పందించిన భరత్.. తనను 12 నిమిషాల్లోనే మ్యాచ్‌కు సిద్ధమవ్వవని చెప్పారని వెల్లడించాడు.
"ఉదయం నేను నా రోజూవారి పని చేసుకుంటున్నా. అంతలోనే సహాయ సిబ్బంది వచ్చి మ్యాచ్‌కు సిద్ధమవ్వమని చెప్పారు. కేవలం 12 నిమిషాల్లోనే రెడీగా ఉండాలన్నారు. నేను మైదానంలోకి వచ్చే సమయానికి బంతి చాలా కిందకు వస్తోంది. అందుకు తగ్గట్లు నేను నా పొజిషన్‌ను మార్చుకున్నా."
-కేఎస్ భరత్, టీమ్ఇండియా క్రికెటర్
ఈ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్లు లాథమ్ (95), విల్ యంగ్ (89), రాస్ టేలర్ (11) ఔట్‌లో భరత్ కీలక పాత్ర పోషించాడు. మరీ ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో విల్ యంగ్ క్యాచ్(KS Bharat Catch)ను అందుకున్న భరత్.. టీమ్‌ఇండియా అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. అశ్విన్ బంతిని కట్ చేయబోయిన విల్ యంగ్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుంది. అయితే అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. వెంటనే కీపర్ భరత్ డీఆర్‌ఎస్‌కు వెళ్లాలని కెప్టెన్ రహానె, బౌలర్ అశ్విన్‌కు సూచించాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన భారత్‌కు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. విల్ యంగ్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకున్నట్లు తేలడం వల్ల అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అలానే సెంచరీకి చేరువైన లాథమ్‌ను భరత్ స్టంప్ ఔట్ చేశాడు.