తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పుట్టినగడ్డపై నాలుగు వికెట్లు పడగొట్టడం మరిచిపోలేని అనుభూతి' - azaz patel latest news

ind vs nz test 2021: పుట్టినగడ్డపై ఆడటం తనకు ఆనందాన్నిచ్చిందని చెప్పాడు న్యూజిలాండ్​ స్పిన్నర్ అజాజ్ పటేల్​. తొలిరోజే నాలుగు వికెట్లు పడగొట్టడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని అన్నాడు.

Ind vs Nz Test series
అజాజ్​ పటేల్​

By

Published : Dec 3, 2021, 10:39 PM IST

Updated : Dec 4, 2021, 5:31 AM IST

azaz patel news: ముంబయిలో పుట్టి విదేశాల్లో స్థిరపడి.. పుట్టినగడ్డపై ప్రత్యర్థిలా బరిలో దిగడం చాలా వింతైన అనుభూతి. అందులోనూ ఆడిన తొలి మ్యాచ్​లోనే నాలుగు వికెట్లు పడగొట్టడం మరింత ఆనందాన్ని కలిగించే విషయం. ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచాడు న్యూజిలాండ్ స్పిన్నర్​ అజాజ్​ పటేల్​. తన కల సాకారమైందని అన్నాడు​. పుట్టినగడ్డపై తొలి మ్యాచ్​లోనే నాలుగు వికెట్లు పడగట్టడం చాలా ప్రత్యేకమైన అనూభూతినిచ్చిందని తెలిపాడు.

"నేను చాలా అదృష్టవంతన్ని. పుట్టిన గడ్డపై ఆడటం ఆనందాన్నిచ్చింది. తొలి మ్యాచ్​లోనే నాలుగు వికెట్లు తీయటం మరింత ప్రత్యేకంగా నిలిచిపోయే అంశం. సరైన లెన్త్​ బాల్స్​ వేసి వికెట్లు రాబట్టొచ్చు. కానీ సగం పనే అయిపోయింది. మరో ఆరు వికెట్లు మిగిలి ఉన్నాయి. రేపు మరింత శ్రమించాల్సి ఉంది."

-అజాజ్ పటేల్​

అజాజ్ పటేల్​ ఎనిమిదేళ్ల వయసులో ఉండగా.. వారి కుటుంబం న్యూజిలాండ్​ వెళ్లి స్థిరపడింది. టీమ్​ఇండియాపై టెస్ట్​ సిరీస్​కు కివీస్ జట్టు ప్రస్తుతం 33 ఏళ్ల వయసులో ఉన్న అజాజ్​ను ఎంపికచేసింది.

మొదట టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(120) నిలకడగా స్కోర్​బోర్డ్​ను పరుగులు పెట్టించాడు. శుభ్​మన్​ గిల్​(44)తో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛెతేశ్వర్ పుజారా, కోహ్లీ డకౌట్​ అయ్యారు. ఈ రోజు మ్యాచ్​లో ఈ నలుగురు బ్యాట్స్​మెన్​ అజాజ్​ బౌలింగ్​లోనే అవుట్​ అయ్యారు.

ఇదీ చదవండి:Ind vs Nz Test: కోహ్లీ అవుట్​ కాదు: మైఖెల్ వాన్​

Last Updated : Dec 4, 2021, 5:31 AM IST

ABOUT THE AUTHOR

...view details