భారత్తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ Test) మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో భారత్కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డివిరిచాడు స్పిన్నర్ అక్షర్ పటేల్.
ఓవర్నైట్ స్కోర్ 129 వద్ద మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ లంచ్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు భారత బౌలర్లపై ఆధిపత్యం వహించి దీటుగా పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్ (89)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత మరో ఓపెనర్ లాథమ్ (95)ను బోల్తా కొట్టించాడు అక్షర్ పటేల్. అనంతరం ఏ ఒక్క కివీస్ బ్యాట్స్మెన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ (18), టేలర్ (11), జేమిసన్ (23), నికోలస్ (2), బ్లండెల్ (13), రచిన్ రవీంద్ర (13) వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు పరిమితమై 49 పరుగుల ఆధిక్యాన్ని భారత్కు అప్పగించింది కివీస్.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లతో కివీస్ నడ్డివిరవగా.. అశ్విన్ 3, జడేజా, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.