Ajinkya Rahane Injury: టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆడట్లేదు. గాయం కారణంగా ఇతడితో పాటు ఇషాంత్, జడేజా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు వెల్లడించింది బీసీసీఐ. దీంతో రహానేకు నిజంగానే గాయమైందా? లేక తప్పించారా? అంటూ నెటిజన్లు బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్స్ చేస్తున్నారు.
IND vs NZ Test: రహానేకు ఉద్వాసన.. బీసీసీఐపై ట్రోల్స్ - అజింక్యా రహానే గాయంపై మీమ్స్
Ajinkya Rahane Injury: భారత్-న్యూజిలాండ్ మధ్య శుక్రవారం రెండో టెస్టు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అనూహ్య ప్రకటన చేసింది బీసీసీఐ. గాయం కారణంగా రహానే, ఇషాంత్, జడేజా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపింది. దీంతో ఆశ్చర్యానికి గురైన అభిమానులు.. బీసీసీఐని సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ గైర్జాజరుతో కివీస్‌తో జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు రహానే. కానీ ఇతడు కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. ఈ టెస్టులో అరంగేట్రం చేసిన శ్రేయస్.. ఓ సెంచరీ, అర్ధసెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో రెండో మ్యాచ్‌కు కోహ్లీ వస్తే ఎవరిని పక్కకు పెట్టాలన్న సందిగ్ధంలో పడింది బీసీసీఐ. రహానేను తప్పించాలని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ ఓ సీనియర్ ఆటగాడిని తప్పిస్తే విమర్శలు వస్తాయని భావించిన యాజమాన్యం.. గాయమని చెప్పి పక్కకు పెట్టిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను రిలీజ్ చేసి.. శుక్రవారం మొదటి టెస్టులో గాయమైందని ఎలా చెబుతారంటూ బీసీసీఐపై మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.
IND vs NZ Test: ఈ రెండో టెస్టులో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కూడా గాయంతో ఈ మ్యాచ్ ఆడట్లేదు. ఇతడి స్థానంలో టామ్ లాథమ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయాలతో దూరమైన రహానే, ఇషాంత్, జడేజా స్థానాల్లో భారత్ తరఫున కోహ్లీ, సిరాజ్, జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చారు.