IND vs NZ Test: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు భోజన విరామ సమయానికి టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (146; 306 బంతుల్లో 16x4, 4x6) భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడికి తోడుగా అక్షర్ పటేల్ (32; 98 బంతుల్లో 4x4) చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఏడో వికెట్‌కు అభేద్యంగా 61 పరుగులు జోడించారు.
IND vs NZ Test: మయాంక్ దూకుడు.. 300కి చేరువలో భారత్ - భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు లంచ్
IND vs NZ Test: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు లంచ్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. మయాంక్ (146*), అక్షర్ పటేల్ (32*)సమయోచితంగా ఆడుతున్నారు.
IND vs NZ
అంతకుముందు రెండో రోజు ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ టీమ్‌ఇండియాను దెబ్బతీశాడు. ఒకే ఓవర్‌లో సాహా(27), రవిచంద్రన్ అశ్విన్(0)లను పెవిలియన్ పంపి మొత్తం ఆరు వికెట్లు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కొనసాగిస్తున్న మయాంక్, అక్షర్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు.
ఇవీ చూడండి: లుక్స్‌తో కేకపుట్టిస్తున్న ఈ 'గోల్ఫ్ సుందరి' ఎవరో తెలుసా?
Last Updated : Dec 4, 2021, 12:03 PM IST