న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్(IND vs NZ t20 series 2021)ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్‌పై కన్నేసింది. గురువారం భారత్-న్యూజిలాండ్‌ల మధ్య తొలి టెస్టు(IND vs NZ 1st test) ప్రారంభంకానుంది. కాన్పుర్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్‌ను షురూ చేసింది టీమ్ఇండియా. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో స్వేదం చిందించారు ఆటగాళ్లు. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేసింది బీసీసీఐ(Board of Cricket Control in India).
INDvsNZ Test: ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు - భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు జట్లు
న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్(IND vs NZ test series 2021) కోసం ప్రాక్టీస్ షురూ చేసింది టీమ్ఇండియా. గురువారం కాన్పుర్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
టీ20 ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు గురువారం ప్రారంభమయ్యే తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు ఇతడు అందుబాటులోకి రానున్నాడు. అలాగే టీ20 సిరీస్‌లో పాల్గొన్న రోహిత్ శర్మ, పంత్, షమీలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ టెస్టు మ్యాచ్‌కు రహానే సారథ్యం వహించనుండగా.. పుజారా వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రాహుల్‌కు గాయం కారణంగా సూర్యకుమార్‌ను జట్టులోకి తీసుకుంది యాజమాన్యం.
Team India Squad for New Zealand Test:రహానే (కెప్టెన్), పుజారా, మయాంక్ అగర్వాల్, గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సాహా, కేఎస్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ