రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా భారత జట్టు సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ జనవరి 24న ఇందోర్‌లో జరగనుంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా సొంతగడ్డ గణాంకాలు చూస్తుంటే చాలా కూల్‌గా ఉన్నాయి. 1988 నుంచి భారత జట్టు కివీస్ జట్టును తమ సొంత గడ్డపై ఏడుసార్లు ఓడించింది.
- 1988లో న్యూజిలాండ్ జట్టును టీమ్ఇండియా 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
- 1995లో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.
- 1999లో భారత గడ్డపై ఇరు జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకోవడంతో టీమ్ఇండియా సిరీస్ విజయం సాధించింది.
- 2010లో న్యూజిలాండ్ భారత గడ్డపై ఐదు వన్డేల సిరీస్ ఆడటానికి వచ్చింది. కానీ ఈసారి కూడా న్యూజిలాండ్ నిరాశపరిచింది. ఈ సిరీస్‌లో భారత జట్టు 5-0తో న్యూజిలాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది.
- 2010 తర్వాత 2016లో భారత గడ్డపై భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో కివీస్ టీమ్ భారత జట్టుకు గట్టిపోటీనిచ్చినా.. సిరీస్ గెలవలేకపోయింది. ధోనీ సారథ్యంలో భారత్.. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.
- 2017లో న్యూజిలాండ్ మళ్లీ భారత్‌కు వచ్చింది. కానీ ఈసారి కూడా కివీస్ జట్టు 2-1తో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
- ప్రస్తుత సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా టీమ్ఇండియా 2-0తో అజేయంగా ఆధిక్యంలో ఉంది. ఈ విధంగా మరోసారి కివీస్ జట్టు భారత గడ్డపై ఓటమిపాలైంది.