రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా, రోహిత్ శర్మ సారథ్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమ్‌ఇండియా సిరీస్ వేటను ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. టాస్ నెగ్గిన టీమ్‌ఇండియా బౌలింగ్ ఎంచుకుని కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Ind vs Nz: గప్తిల్, చప్మన్ హాఫ్ సెంచరీ.. టీమ్‌ఇండియా లక్ష్యం 165
టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టీ20లో న్యూజిలాండ్ పర్వాలేదనిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి భారత జట్టు ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ డారిల్ మిచెల్ (0)ను భువనేశ్వర్ క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్‌మన్‌లతో(63) కలిసి మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (70: మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి శతక (109) భాగస్వామ్యం నిర్మించారు. అయితే, వెంటవెంటనే చాప్‌మన్‌తోపాటు ఫిలిప్స్ (0) పెవిలియన్‌కు చేరాడు. ఈ రెండు వికెట్లను అశ్విన్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఫర్ట్ (12)తో కలిసి గప్తిల్ ధాటిగా ఆడాడు. మళ్లీ గప్తిల్, సీఫర్ట్ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడం వల్ల కివీస్ స్కోరు బోర్డు వేగం తగ్గిపోయింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవింద్ర 7, సాట్నర్ 4* పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 2, భువనేశ్వర్ 2.. చాహర్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి:Ind Vs Nz: టాస్ గెలిచిన టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్ బ్యాటింగ్