తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ సెమీస్ ప్రత్యర్థి కన్ఫార్మ్ - కివీస్​​తో టీమ్ఇండియా 'ఢీ' - ఈసారి రివెంజ్ పక్కా! - ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టిక

Ind vs Nz Semi Final 2023 : 2023 వరల్డ్​కప్​లో సెమీ ఫైనల్స్​ నాలుగో బెర్త్​ను న్యూజిలాండ్.. అధికారికంగా ఖరారు చేసుకుంది. దీంతో నవంబర్ 15న ముంబయి వేదికగా భారత్ - న్యూజిలాండ్​ జట్లు తలపడనున్నాయి.

Ind vs Nz Semi Final 2023
Ind vs Nz Semi Final 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 7:46 PM IST

Updated : Nov 11, 2023, 8:17 PM IST

Ind vs Nz Semi Final 2023 :వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ఇండియా సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. నవంబర్ 15న ముంబయి వాంఖడే వేదికగా జరిగే తొలి సెమీస్‌లో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ కివీస్.. టీమ్ఇండియా తలపడ్డాయి. ఆ మ్యాచ్​లో భారత్ 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడింది. ఆ మ్యాచ్​లో భారత్ ఓటమిని టీమ్ఇండియా ఫ్యాన్స్ చాలా రోజుల పాటు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు భారత్​కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. దీంతో ఈసారి కివీస్​ను ఎలాగైనా దెబ్బకు దెబ్బ కొట్టాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.

World Cup 2nd Semi Final : మెగాటోర్నీలో రెండో సెమీస్​ సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 16న జరగనుంది. ఈ సమరానికి కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ వేదికకానుంది. అయితే ఈ మ్యాచ్​లో గెలిచి తొలిసారి వరల్డ్​కప్ ఫైనల్ చేరాలని సఫారీ జట్టు ఆశిస్తుంటే.. మరోవైపు ఏడోసారి ఫైనల్ చేరాలని ఆసీస్​ పట్టుదలతో ఉంది.

Pakistan Out From World Cup 2023: ఇక ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్‌ విజయం సాధించినా నాకౌట్‌కు అర్హత సాధించదు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని పాక్ 6.4 ఓవర్లలో ఛేదిస్తే న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ను అధిగమించి.. పాక్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కానీ, ఆ జట్టు 6.4 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాక్ అధికారికంగా సెమీస్ రేసు నిష్క్రమించింది. మరోవైపు 2027 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్​కు కూడా ఈ మ్యాచ్​లో గెలవడం తప్పనిసరి.

World Cup Final :ఈ సెమీ ఫైనల్స్​లో నెగ్గిన రెండు జట్లు ఫైనల్​కు ఆర్హత సాధిస్తాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరగనుంది. సెమీస్ చేరిన నాలుగు జట్లలో అత్యధిక సార్లు ఆసీస్ 5 సార్లు ఛాంపియన్​గా నిలువగా.. భారత్ 2సార్లు వరల్డ్​కప్ ట్రోఫీని ముద్దాడింది. ఇక న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఒకసారి కూడా ట్రోఫీ గెలవలేదు.

Ind Vs Nz World cup 2023 : శతక్కొట్టిన మిచెల్​.. షమీ పాంచ్ పటాకా.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే ?

World Cup 2023 Semi Final : సెమీస్​ను చేరే జట్లు ఇవే.. అయితే ఓ చిన్న ట్విస్ట్​!

Last Updated : Nov 11, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details