IND VS NZ Second ODI women cricket: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. మూడు వికెట్ల తేడాతో పరాజయం చెందింది. ఫలితంగా ఐదు మ్యాచుల సిరీస్‌లో 2-0తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. విజయంలో కీలకంగా వ్యవహరించిన అమెలియా కెర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
271 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 49 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అమెలియా కెర్(119*) సెంచరీ, మ్యాడీ గ్రీన్(52) అర్ధ శతకాలతో మెరిశారు. సోఫీ డివైన్(33) పర్వాలేదనిపించింది. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 4, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ దక్కించుకున్నారు.