కోల్‌కతా వేదికగా నేడు (ఆదివారం) న్యూజిలాండ్‌తో (India vs New Zealand) ఆఖరి టీ20 జరుగుతోంది. అందులో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమ్ఇండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన.. కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్‌గా సాంట్నర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గత రెండు టీ20లకు (Ind vs NZ T20) సారథ్యం వహించిన తాత్కాలిక సారథి టిమ్ సౌథీకి విశ్రాంతినిచ్చారు.
ఇక టీమ్ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, అశ్విన్‌లకు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో ఇషాన్ కిషన్, చాహల్‌కు తుది జట్టులో అవకాశం లభించింది.