ind vs nz test 2021: ముంబయి వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు రెండో సెషన్ ముగిసింది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో తొలి సెషన్‌ను నిర్వహించలేదు. 37 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్‌లో ఇరు జట్లు సమంగా నిలిచాయి. భారత్ మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (52) అర్ధ శతకంతో రాణించాడు.
ind vs nz test: మయాంక్ అర్ధ శతకం.. టీ బ్రేక్ సమయానికి భారత్ 111/3 - ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
ind vs nz test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ ఆఫ్ సెంచరీతో సత్తా చాటాడు. టీ విరామానికి కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు సాధించింది.
![ind vs nz test: మయాంక్ అర్ధ శతకం.. టీ బ్రేక్ సమయానికి భారత్ 111/3 ind vs nz test 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13805867-thumbnail-3x2-img.jpg)
27 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడుతున్న భారత్‌కి.. ఆ తర్వాతి ఓవర్లో అజాజ్ పటేల్ షాకిచ్చాడు. క్రీజులో కుదురుకున్న శుభ్‌మన్ గిల్ (44)ని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛెతేశ్వర్ పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లి (0)లను కూడా అజాజ్ పటేల్ వేసిన 30వ ఓవర్లో ఔట్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతికి పుజారా బౌల్డ్ కాగా, ఆఖరు బంతికి కోహ్లి వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ (7) క్రీజులో ఉన్నాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ మూడు వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి:IND vs SA Series: సందిగ్ధంలో పుజారా, రహానే కెరీర్.. ఆ సిరీస్‌పైనే ఆశలు!