శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలోనూ శతకంతో మెరిసిన టీమ్ఇండియా బ్యాటర్ శుభమన్ గిల్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మరో సెంచరీ బాదాడు. దీంతో ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన గిల్ 87 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకుని వరుసగా రెండో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా వన్డేల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ.
వెయ్యి పరుగులు పూర్తి.. ఈ క్రమంలోనే వన్డేల్లో గిల్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్‌లు ఈ ఫీట్‌ను అందుకున్నాడు. దీంతో అతడు కోహ్లీ, ధావన్ రికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్ 27 మ్యాుచుల్లో 24 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును సాధించగా.. ధావన్ 24 మ్యాచులు 24 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను అందుకున్నాడు.