న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ 38 బంతుల్లో 2 సిక్స్‌లు, 4 ఫోర్లు సాయంతో 34 పరుగులు చేశాడు. అయితే మూడో ఓవర్‌లో కివీస్ బౌలర్ హెన్రీ షిప్లే బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఓ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ధోని పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్ బద్దలు కొట్టాడు. ఆ తర్వాత ఐదో ఓవర్ నాలుగో బంతికి మరోసారి షిప్లే బౌలింగ్‌లోనే రోహిత్ మరో సిక్స్ కొట్టాడు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై తన ఖాతాలో ఉన్న సిక్స్‌ల సంఖ్య 125కు చేరింది. ఆ తర్వాత ధోనీ 123, యువరాజ్ సింగ్ 71 బాదారు.
IND VS NZ: రోహిత్ మళ్లీ ఫెయిల్.. కానీ ధోనీ రికార్డ్ బ్రేక్! - rohith century
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హిట్‌మ్యాన్ తక్కువ స్కోరుకే ఔటైనప్పటికీ మాజీ సారథి ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ వివరాలు..
IND VS NZ: రోహిత్ మళ్లీ ఫెయిల్.. కానీ ధోనీ రికార్డ్ బ్రేక్!
శుభారంభం అందించినా.. వరుస వైఫల్యాలు.. ఇకపోతే రోహిత్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. మూడు అంకెల స్కోరు సాధించలేక కష్టపడుతున్నాడు. అయితే గత కొన్ని మ్యాచుల నుంచి హిట్‌మ్యాన్‌ను గమనించినట్టైతే.. అతడు బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ మంచి ఆరంభాలే అందించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు.
- రీసెంట్గా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ఇదే జరిగింది. లంకపై తొలి వన్డేలో 83 పరుగులు(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు హిట్‌మ్యాన్. ఈ మ్యాచ్‌లో అతడు సెంచరీ సాధిస్తాడని అంతా ఊహించినప్పటికీ విఫలమయ్యాడు. 17 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
- రెండో వన్డేలో 21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 17 పరుగులు చేసి నిరాశపరిచాడు.
- మూడో వన్డేలో 42 పరుగులు(49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి శుభారంభాన్ని అందించినా ముందుకు సాగలేకపోయాడు.
- అంతకుముందు బంగ్లాదేశ్ పర్యటనలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించాడు. తొలి వన్డేలో 31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 27 పరుగులు చేశాడు.
- రెండో వన్డేలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 51 రన్స్(28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ భారీ స్కోరు చేయలేకపోయాడు.
- అంతకుముందు టీ20 వరల్డ్‌కప్-2022లోనూ రోహిత్ వరుసగా విఫలమయ్యాడు. ఆ మెగా టోర్నీలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ 53 పరుగులు (39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. కానీ మిగతా టోర్నీలో అస్సలు రాణించలేకపోయాడు.
- ఇక పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో 4(7), దక్షిణాఫ్రికాపై 14(17), బంగ్లాదేశ్‌పై 2 (8), జింబాబ్వేపై 15 (13), సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 27(28).. ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. చివరిసారిగా 2021 సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌పై సెంచరీ సాధించిన రోహిత్.. దాదాపు ఏడాదిన్నరగా ఆ మార్కును అందుకోలేకపోతున్నాడు.
ఇదీ చూడండి:డోపింగ్ పరీక్షలో ఫెయిల్.. ద్యుతి చంద్‌పై తాత్కాలిక నిషేధం