తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ భళా.. కివీస్​పై భారీ అధిక్యం

IND vs NZ 2nd Test: భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్ 69/0 పరుగులతో నిలిచింది. మయాంక్ అగర్వాల్(38*), ఛెతేశ్వర్ పుజారా(29*) క్రీజులో ఉన్నారు.

By

Published : Dec 4, 2021, 5:27 PM IST

IND vs NZ
భారత్, న్యూజిలాండ్

Ind vs nz test: టీమ్​ఇండియా, న్యూజిలాండ్ మధ్య రెండో రోజు రెండో ఇన్నింగ్స్​లో భారత్​ నిలకడగా రాణించింది. తొలి ఇన్నింగ్స్​లో అదరగొట్టిన ఓపెనర్​ మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్​లోనూ 38 పరుగులతో నిలకడగా రాణించాడు. అతడు పుజారా(29) క్రీజులో ఉన్నారు. దీంతో సెషన్​ ముగిసేసరికి భారత్ 69/0 పరుగులు చేసింది. ప్రస్తుతం 332 పరుగుల ఆధిక్యంలో ఉంది.

కుప్పకూలిన కివీస్..

తొలి ఇన్నింగ్స్​లో కివీస్​ ఘోరంగా విఫలమైంది. భారత బౌలర్ల ధాటికి విలవిలలాడిన కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.

Ajaz Patel Record: తొలి ఇన్నింగ్స్​లో 10 వికెట్లు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్. టీమ్​ఇండియా ఆటగాళ్లందరినీ తన స్పిన్​ మాయాజాలంతో కట్టడి చేశాడు. టెస్టులో పది వికెట్లు సాధించిన మూడో బౌలర్​గా రికార్డుకెక్కాడు.

ABOUT THE AUTHOR

...view details