ప్రముఖ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్(harshal patel de villiers) తన కెరీర్‌పై చాలా ప్రభావం చూపాడని టీమ్‌ఇండియా యువ పేసర్ హర్షల్ పటేల్(harshal patel news) అన్నాడు. శుక్రవారం(నవంబర్ 19) భారత్ తరఫున అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను 153/6కు టీమ్‌ఇండియా పరిమితం చేసింది. హర్షల్ రెండు వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేసి కీలక పాత్ర పోషించాడు.
"ఇంతకుమించిన మంచి అరంగేట్రం ఆశించలేను. అంతగా టాలెంట్ లేని నాలాంటి ఆటగాడు ఆటలో రాణించాలంటే ప్రతి చిన్న విషయం నుంచీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మొదట్లో తప్పులు చేసి.. నేనేం చేయగలనో.. ఏం చేయలేనో లాంటి విషయాలు గుర్తించాను. దీంతో నెమ్మదిగా రాణించడం మొదలుపెట్టా. ఇక బౌలింగ్‌లో మరీ ఎక్కువ వైవిధ్యమైన బంతులు వేయాలని నేను అనుకోను. మనం ఎలాంటి బంతులేస్తామో వాటిపైనే దృష్టిపెట్టి మరింత మెరుగైతే చాలనుకుంటా. టీమ్‌ఇండియా తరఫున ఆడటం.. ఇక్కడ రాణించడం, నా నైపుణ్యాలు ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది"
--హర్షల్ పటేల్, టీమ్‌ఇండియా పేసర్.