భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో షాక్‌కు గురైన భద్రతా సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై ఆ అభిమానిని మైదానం నుంచి తీసుకెళ్లారు. దాంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. అయితే మైదానంలోకి దూసుకొచ్చిన ఆ అభిమాని ఓ 12 ఏళ్ల బాలుడు కావడం విశేషం.
గ్రౌండ్లోకి దూసుకొచ్చిన పిల్లాడు.. షాకైన సెక్యూరిటీ.. రోహిత్‌ను హగ్ చేసుకుని.. - india newzealand fan
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ చిట్టి అభిమాని.. సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ గట్టిగా హగ్ చేసుకున్నాడు.
రోహిత్ శర్మను పిచ్చిగా అభిమానించే ఆ పిల్లవాడు.. తన ఆరాధ్య క్రికెటర్‌ను ఎలాగైన కలవాలనే ఉద్దేశంతో సాహసం చేశాడు. ఇక ఆ పిల్లాడిని వదిలేయాని రోహిత్ శర్మ సెక్యూరిటీకి సూచించడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రోహిత్ శర్మ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్లెయిర్ టిక్‌నెర్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ నాలుగో బంతిని రోహిత్ సిక్సర్ బాదగా.. అనంతరం ఆ బాలుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. బంతితో ప్రత్యర్థిని చిత్తు చేసి, బ్యాట్‌తో రాణించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.