IND vs NZ Test Toss: తొలి టెస్టులో విజయాన్ని కొద్దిలో మిస్సయిన భారత జట్టు న్యూజిలాండ్‌తో జరగబోయే రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. టీ20 ప్రపంచకప్ తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యచ్‌లో ఆడనున్నాడు. విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని చూస్తోంది.
IND vs NZ Test: చిత్తడిగా ఔట్‌ఫీల్డ్.. టాస్ ఆలస్యం
IND vs NZ Test Toss: నేడు (శుక్రవారం) భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ జరిగే వాంఖడేలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మైదానం పిచ్, ఔట్‌ఫీల్డ్ తేమగా ఉండటం వల్ల టాస్ ఆలస్యం కానుంది.
IND vs NZ
టాస్ ఆలస్యం
రెండు రోజులుగా ముంబయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాంఖడే మైదానం చిత్తడిగా మారింది. నేడు (శుక్రవారం) వర్షం లేకపోయినా.. పిచ్, ఔట్‌ఫీల్డ్ తడిగా ఉంది. దీంతో టాస్ ఆలస్యం కానున్నట్లు తెలిపారు అంపైర్లు. 10.30 గంటలకు మరోసారి పిచ్‌ను పరీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవీ చూడండి: India vs NZ 2nd Test: సిరీస్‌పై కన్నేసిన ఇరుజట్లు.. భారత్‌కు అదే సమస్య!
Last Updated : Dec 3, 2021, 9:55 AM IST