IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టెస్టుకు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సీఏ)(Mumbai Cricket Association News) వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్‌ని నిర్వహిస్తామని ప్రకటించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిసెంబరు 3 నుంచి టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్(India vs NZ 2nd Test Venue) జరగనుంది.
'కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇస్తాం. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వాంఖడే స్టేడియం ఓ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. కాబట్టి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తాం' అని ఎమ్‌సీఏ సెక్రెటరీ సంజయ్ నాయక్ తెలిపారు. ఈ స్టేడియంలో చివరి సారిగా 2016 డిసెంబరులో భారత్, ఇంగ్లాండ్ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. వాంఖడే స్టేడియంలో ఒకేసారి 33 వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు.