IND Vs NZ 2nd Test: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆట ముగిసేసమయానికి ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్ (36), రచిన్ రవీంద్ర (2) ఉన్నారు.
కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లేథమ్ (6), రాస్ టేలర్ (6), టామ్ బ్లండెల్ (0) మరోసారి విఫలమయ్యారు. విల్ యంగ్ (20) కాస్త ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఈ మూడు వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
మరోసారి మొదటి ఇన్నింగ్స్ మాదిరిగానే కుప్పకూలుతుందని కంగారు పడిన కివీస్‌ను డారిల్ మిచెల్ (60) ఆదుకున్నాడు. నికోల్స్‌తో కలిసి అర్ధశతకం (73) భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసి ధాటిగా ఆడిన మిచెల్‌ను అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. చివరి రెండు రోజుల్లో కివీస్ గెలవాలంటే 400 పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదు వికెట్లు తీస్తే విజయంతోపాటు సిరీస్ టీమ్‌ఇండియా సొంతమవుతుంది.
చివర్లో అక్షర్ ధాటిగా..